అనంతపురం జిల్లాలో పలు చోట్ల రైతులు ఆందోళన చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా రాలేదంటూ రోడ్డెక్కారు. ఉరవకొండ నియోజకవర్గంలో చాబాల, నింబగళ్లు గ్రామాల్లో తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. జూన్ 14న జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.... రైతులకు పంట బీమా నిధులు విడుదల చేశారు. తమ పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేవంటూ రైతులు ఆందోళన బాటపట్టారు.